అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | పిల్ల కాలువలో మొసలి(Crocodile) ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనయకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) నగర శివారులో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ(Kotwalguda)లో మొసలి కనిపించింది. హిమాయత్ సాగర్ పిల్లకాలువలోకి మొసలి రావడంతో స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు(Forest Department Officers) ఘటన స్థలానికి చేరుకొని దానిని బందించారు. అనంతరం మొసలిని నెహ్రూ జూపార్క్(Nehru Zoo Park)కు తరలించారు.