More
    Homeఆంధ్రప్రదేశ్​Weather Updates | వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌.. నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు

    Weather Updates | వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌.. నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), దక్షిణ ఒడిశా(South Odisha) తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడ‌డంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కి.మీ మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వ‌ల‌న తెలంగాణ (Telangana)లో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. ఈ రోజు, రేపు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం(Weather Department) వెల్లడించింది.

    READ ALSO  Yoga Day | ఎల్​బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన యోగా డే కౌంట్​డౌన్​

    Weather Updates | జ‌ర భ‌ద్రం..

    ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

    ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంమన్యం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైద‌రాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో (Thunders) అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు(Meteorological Department officers) తెలిపారు.

    READ ALSO  Cabinet Meeting | 23న తెలంగాణ కేబినెట్​ భేటీ

    Latest articles

    Gadwal SP | మనం అలా దొరకకూడదు.. తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gadwal SP | గద్వాల తేజేశ్వర్​ హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాస్(Gadwa SP Srinivas)​...

    Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో మరింత వేగం.. మినట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌లోకి ఎంట్రీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Flipkart | దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) మార్కెట్‌లో వాటా మరింత పెంచుకోవడంపై...

    Actress Laya | చెప్పులు లేకుండా సినిమా మొత్తం పరిగెత్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ల‌య‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Heroine Laya | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన లయ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి...

    IRCTC Tour Package | కర్ణాటకలోని ప్రకృతి అందాలు చూసొద్దామా.. ఐఆర్​సీటీసీ మరో సూపర్​ ప్యాకేజీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:IRCTC Tour Package | వర్షాకాలం వచ్చిందంటే అడవులు పచ్చదనంతో కళకళలాడుతాయి. జలపాతాలను తమ హోయలతో కట్టి...

    More like this