అక్షరటుడే, వెబ్డెస్క్ :Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదని భారతీయులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏడాది అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా భారీ స్థాయిలో పసిడి విక్రయాలు(Gold sales) జరగుతాయి.
ధనవంతులతో పాటు మధ్య తరగతి వారు కూడా ఈ రోజున ఎంతో కొంత బంగారం(Gold) కొంటారు. పెద్ద పెద్ద నగల దుకాణాలు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడాని అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు(Special offers) ఇస్తాయి. కాగా.. ఈ ఏడాది అక్షయ తృతీయకు బంగారం విక్రయాలు తగ్గాయి. బంగారం ధరలు(Gold Prices) భారీగా పెరగడంతో జనం కొనుగోలు చేయడానికి వెనకంజ వేశారు.
గతేడాది అక్షయ తృతీయ రోజు తులం బంగారం రూ.72,300 ఉంటే, ఏడాది రూ.98 వేల వరకు ఉంది. దీంతో విక్రయాలు అనుకున్న స్థాయిలో జరగలేదని మార్కెట్(Market) వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది పండుగ రోజు 20 టన్నుల బంగారం విక్రయాలు జరగ్గా ఈ సారి కూడా అంతే మొత్తంలో జరిగినట్లు తెలిపాయి. వీటి విలువ రూ.18 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. బంగారం ధరలు ఈ మధ్య భారీగా పెరగడంతో ప్రజలు గోల్డ్ ETFలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి విక్రయాలు తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు.