అక్షరటుడే, వెబ్డెస్క్:Bank Holidys | దేశంలోని పలు రాష్ట్రాల్లో మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు bank holidays ఉన్నాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూసి banks closes ఉండనున్నాయి.
లేబర్ డే(Labor Day), బుద్ధ పూర్ణిమ(Buddha Purnima), మహారణా ప్రతాప్ జయంతి(Maharana Pratap Jayanti), వంటి ప్రాంతీయ పండుగలతో పలు రాష్ట్రాల్లో ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో పాటు 4 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలుపుకొని మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
తెలంగాణ(Telangana)లో మే 1న లేబర్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు(Bank Holiday) ఉంది. దీంతో పాటు మే 4, 11, 18, 25 రోజుల్లో ఆదివారం సందర్భంగా, మే 10, 24 న రెండో, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్ ఉండన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో మేలో 7 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.