అక్షరటుడే, బాన్సువాడ:Anganwadi Center | అంగన్వాడీ కేంద్రాలకు మేనెలలో సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఖలీల్(CITU district leader Khalil) డిమాండ్ చేశారు. బుధవారం బాన్సువాడ సీడీపీవో సౌభాగ్యకు సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు(Anganwadi Teachers) కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలతో(Government School) సమానంగా తమకు కూడా సెలవులు(Holidays) ప్రకటించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న కలెక్టరేట్(Collectorate) ఎదుట ధర్నాను విజయవంతం చేయాలని అంగన్కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు మహాదేవి, రాధ, శివగంగ, వజ్ర తదితరులు పాల్గొన్నారు.
