అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hitech Theft | రోజురోజుకు సాంకేతికత పెరుగుతోంది. కార్లలో కూడా ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వాటిని చోరీ చేయడం కష్టం. అయితే దొంగలు కూడా సాంకేతికను అందిపుచ్చుకుంటున్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. హైటెక్ దొంగలు(Hitech Thieves) కారును హ్యాక్ చేసి క్షణాల్లో మాయం చేశారు.
ఢిల్లీలోని సర్దార్ జంగ్ ఎన్ క్లేవ్(Sardar Jung Enclave)లో నివసించే రిషభ్ చౌహాన్ ఆరు నెలల క్రితమే క్రెటా కారు కొనుగోలు చేశాడు. ఆధునిక ఫీచర్ల ఉన్న ఈ కారును హ్యాక్ చేయొచ్చు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు 60 సెకన్లలో కారును హ్యాక్(Car Hacked) చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ముందు ఓ కారులో దొంగలు వచ్చారు. అందులో నుంచి ఓ వ్యక్తి దిగి క్రెటా కారు ఐడెంటిఫికేషన్ కోడ్ (Identification code) స్కాన్ చేశాడు. మరో వ్యక్తి దిగి కారు ముందు అద్దం పగులగొట్టి వెళ్లాడు. అనంతరం మరో వ్యక్తి ట్యాబ్ పట్టుకొని వచ్చాడు. కారు సెక్యూరిటీ సిస్టం (Car security system) హ్యాక్ చేసి దానిని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందు అద్దం పగులగొట్టిన వ్యక్తి కారును చోరీ చేసుకొని వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితమే కొనుగోలు చేసిన కారు పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Hitech Theft | అదేలా సాధ్యం
ప్రస్తుతం కార్లలో ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతేగాకుండా సెక్యూరిటీ పరంగా కూడా మేలు చేస్తాయి. అయితే దొంగలు వీటిని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కార్ల ఐడెంటిఫికేషన్ కోడ్ ఆధారంగా వోబీడీ పోర్ట్‌ను హ్యాక్ చేసి స్టార్ట్ చేస్తున్నారు. అనంతరం వాటిని తీసుకొని వెళ్లిపోతున్నారు. ఢిల్లీ(Delhi)లో ఇటివల ఇలాంటి ఘటనలు పెరిగినట్లు సమాచారం.