అక్షరటుడే, వెబ్డెస్క్: Bhoodan lands | భూదాన్ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు telangana high court సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ cbi, ఈడీ ed విచారణ చేస్తే కానీ వాస్తవాలు బయటికి వచ్చేలా లేవని కోర్టు వ్యాఖ్యానించింది. మహేశ్వరం maheswaram మండలం నాగారం భూదాన్ భూముల్లో budhan lands అక్రమాలు జరిగాయాని మహేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ భూదాన్ భూములను కొందరు ఐఏఎస్ ias, ఐపీఎస్ ips అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. అక్రమాలపై ప్రభుత్వం, భూదాన్ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమాలపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా జడ్జి స్పందిస్తూ విచారణ చేయగలరో, లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు పంపారు. వివాదాస్పద భూముల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించారు. విచారణను జూన్ 26కు వాయిదా వేశారు.