More
    HomeజాతీయంTerror Attack | కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణలో హై అలర్ట్!

    Terror Attack | కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణలో హై అలర్ట్!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Terror Attack | దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు terror attacks మరిన్ని జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు telangana police అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో హెచ్ఐసీసీ HICC కేంద్రంగా జరగనున్న భారత్ సమిట్ bharat summit-2025, మే 7 నుంచి 31 వరకు నిర్వహించే మిస్ వరల్డ్-2025 miss world events hyderabad సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

    హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి CS shanti kumari  పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ జితేందర్ DGP jitendar పలు అంశాలపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై భారత్ సమిట్లో చర్చ జరుగుతుంది. ఈ సమిట్లో రాహుల్​గాంధీ Rahul Gandhi సహా వంద దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల కంటెస్టెంట్స్ హాజరుకానున్నారు.

    ఇవన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కావడంతో పోలీసు యంత్రాంగం సవాల్ గా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్​లో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా ఇతర పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

    భారత్ సమిట్ bharat summit 2025 జరిగే సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను నేటి (గురువారం) నుంచే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీ సహా అనుమానిత ప్రాంతాల్లో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.

    Latest articles

    Kamareddy Collector | మానవత్వం చాటుకున్న కలెక్టర్

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్​ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన...

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయది దేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​...

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....

    Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

    అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​...

    More like this