ePaper
More
    HomeతెలంగాణOperation Kagar | భద్రాద్రి ఏజెన్సీలో హై అలెర్ట్​.. పోలీసుల కూంబింగ్​

    Operation Kagar | భద్రాద్రి ఏజెన్సీలో హై అలెర్ట్​.. పోలీసుల కూంబింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Kagar | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్​ నెలకొంది. అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్​ చేపట్టారు. మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో సోదాలు చేస్తున్నారు. తాడ్వాయి, కరకగూడెం, కిన్నెరసాని అడవుల్లో సైతం సెర్చ్​ ఆపరేషన్(Search Operation)​ కొనసాగుతోంది. గిరిజన గ్రామాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు(Maoists) లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ప్రతి వర్షాకాలంలో మావోలు రెస్ట్​ తీసుకుంటారని.. అయితే ఈ సారి వారికి నిద్ర లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆపరేషన్​ కగార్(Operation Kagar)​లో భాగంగా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగిస్తున్నాయి.

    READ ALSO  Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    సాధారణంగా వానాకాలంలో అడవుల్లో వాగులు, నదులు పారుతాయి. చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి దట్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో బలగాలకు కూంబింగ్​కు అనుకూల పరిస్థితులు ఉండవు. దీంతో ప్రతి ఏటా మావోయిస్టులు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని రెస్ట్​ తీసుకునే వారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో సైతం ఆపరేషన్​ కగార్​ కొనసాగించి మావోల ఆట కట్టిస్తామని అమిత్​ షా(Amit Shah) ప్రకటించారు. ఇందులో భాగంగా నిత్యం అడవులను జల్లెడ పడుతున్నారు.

    Operation Kagar | కర్రెగుట్టల్లో తనిఖీలు మరవక ముందే..

    తెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) సరిహద్దులో గల కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఏప్రిల్​లో వేల సంఖ్యలో భద్రతా బలగాలు ఆపరేషన్​ చేపట్టాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల బంకర్లను బలగాలు గుర్తించి, ధ్వంసం చేశాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా భద్రాద్రి ఏజెన్సీలో మావోయిస్టుల కోసం కూంబింగ్(Coombing)​ చేపడుతుండడం గమనార్హం.

    READ ALSO  Minister Seethakka | కేటీఆర్‌కు ఎందుకింత అహంకారం..? ఆదివాసి బిడ్డ‌ను టార్గెట్ చేస్తారా...! అని సీత‌క్క ధ్వ‌జం

    Latest articles

    Nizamabad Police | హెడ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతి

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Police | నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ (Nizamabad Police Commissionerate) పరిధిలోని పలువురు...

    CP Sai chaitanya | సీపీని కలిసిన నూతన ఎస్సైలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నియమితులైన ఎస్సైలు...

    Accounts Block | ఖాతాల బ్లాకింగ్ పై వివాదం రాజేసిన ‘ఎక్స్’.. ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్ పై ఆందోళన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Accounts Block | కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X (గతంలో ట్విట్టర్)...

    Operation Kagar | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు జవాన్లకు గాయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Kagar | మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి. 2026...

    More like this