అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య Teacher MLC Malka Komuraiah తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఓటేసి గెలిపించిన వారందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో BJP office హెల్ప్ సెంటర్ Help Center ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ సమస్యలను చెప్పాలన్నారు. తీవ్రవాదుల కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
వక్ఫ్ బోర్డు Waqf Board కోసం స్పందించిన వారు ప్రతిపక్షాలు తీవ్రవాదుల చర్యలకు స్పందించకపోవడం తగదన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లోని Jammu Kashmir పహల్గామ్లో Pahalgam తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ Government Advisor Shabbir Ali వక్ఫ్ బోర్డ్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు తీశారని.. కానీ తీవ్రవాదుల కాల్పులకు మాత్రం ఇప్పటికీ నివాళులర్పించకపోవడం ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.