అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం rains in Telangana కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి జనజీవనాన్న అతలాకుతలం చేసింది. Hyderabad rains బంజారాహిల్స్ Banjara hills, జూబ్లీహిల్స్ jubilee hills, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, సుష్మా, భాగ్యలతా, పెద్ద అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం పడింది.
సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, పంజాగుట్ట, బషీర్ బాగ్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో మహానగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కుండపోత వానతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.