అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad City | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే పలు జిల్లాల్లో జల్లులు కురిశాయి. సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాన దంచి కొడుతోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో సోమవారం కూడా భారీ వర్షం పడింది. రాత్రి 7 గంటల నుంచి 11 వరకు వాన పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ రోజు కూడా వాన పడుతుండడంతో రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. నగరంలో రాత్రి వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.