అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rain | హైదరాబాద్ (Hyderabad)లో భారీ వర్షం పడుతోంది. గత రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. అంతేగాకుండా భారీ వర్షం(Heavy Rain) పడడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, గాజులరామారం, జీడిమెట్ల ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరి కొద్ది సేపట్లో ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
