అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | రాష్ట్రంలో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పెట్టినా.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీగా ఈదురు గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో వాతావరణం మారిపోయింది. రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి మెదక్ జిల్లాల్లో గాలివాన కురుసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సిద్దిపేట, యాదాద్రి, జనగామ, సిరిసిల్లలో కూడా చెదురుమదురు వానలు పడొచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో భారీగా మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం కురిసిన వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.
Rain Alert | రేపు వడగళ్ల వానకు అవకాశం
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో బుధవారం గాలివాన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగళ్ల వర్షం పడొచ్చని అధికారులు హెచ్చరించారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.