అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) కీలక సూచనలు జారీ చేశారు.
వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మంగళవారం వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నగరంలో నాలుగు రోజులుగా సాయంత్ర భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Hyderabad | అనవసర ప్రయాణాలు వద్దు
వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అనవసర ప్రయాణాలు చేయద్దని పోలీసులు కోరారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఇవ్వాలని పోలీసులు ఉదయం సూచించడంపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ రోజు వర్క్ ఫ్రం ఇవ్వాలని ఉదయమే చెబితే ఎలా అంటున్నారు. అలా చేయడం కుదరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.