అక్షరటుడే, వెబ్డెస్క్ :Rain Alert | హైదరాబాద్(Hyderabad)లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ఇప్పటికే దిల్సుఖ్నగర్ ప్రాంతంలో వర్షాలు ప్రారంభం అయ్యాయి. మరి కొద్ది సేపట్లో నగర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC అధికారులు సూచించారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సైతం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడుతాయని తెలిపారు.
