అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని పలువురు హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఎనిమిది మందికి ప్రమోషన్ లభించింది.
పదోన్నతి పొందినవారిలో నందిపేటకు హెడ్ కానిస్టేబుల్ ఎండీ రియాజుద్దీన్, మోపాల్ పీఎస్‌కు చెందిన కె.పరమేశ్వర్, సీఎస్‌బీకి చెందిన పి.వసంత్ రావు, ఆరో టౌన్‌కు చెందిన జక్రయ్య, మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన అరుణ కుమారి, రూరల్ పీఎస్‌కు చెందిన అనురాధ, పీసీఆర్‌కు చెందిన జీవీ రమణేశ్వరి, సీసీఆర్‌బీకి చెందిన ముంతాజ్ బేగం ఉన్నారు. ఈ మేరకు మంగళవారం సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా వారిని సీపీ అభినందించారు.