అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UP Police | ఓ వ్యక్తి తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండాలని యత్నించాడు. తన కారు carను హెలిక్యాప్టర్ helicapterలా డిజైన్ చేసి మురిసిపోయాడు. ఆ కారుతో రోడ్లపై రయ్యుమని దూసుకెళ్దామని అనుకున్నాడు. కానీ యూపీ పోలీసులు up police ఆయనకు షాక్ ఇచ్చారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యూపీ ప్రతాప్ గడ్ జిల్లాలోని పట్టి కొత్వాలిలో రాజ్ నారాయణ్ అనే వ్యక్తి కారును హెలికాప్టర్‌గా మార్చాడు.
పట్టి కొత్వాల్ అవన్ కుమార్ దీక్షిత్ బధ్వా బజార్‌లో గస్తీ తిరుగుతుండగా.. ఈ హెలికాప్టర్ ఆకారంలో ఉన్న కారును చూశారు. దానికి చూసి ఆశ్చర్యపోయిన ఆయన తర్వాత తేరుకొని ఠాణాకు తరలించారు. కారును అనధికారికంగా మోడిఫై చేసినందుకు రూ.25 వేల జరిమానా విధించారు. కాగా సదరు కారును రాజ్‌నారాయణ పెళ్లిలో వధూవరుల ఊరేగింపు కోసం అద్దెకు ఇచ్చేవాడని తెలిసింది. అయితే మోడిఫై చేసిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.