ePaper
More
    Homeక్రీడలుShami-Haseen | మళ్లీ ముదురుతున్న షమీ-హసీన్ జహాన్ వివాదం.. క్రిమినల్స్​తో చంపించాలనుకున్నాడంటూ కామెంట్

    Shami-Haseen | మళ్లీ ముదురుతున్న షమీ-హసీన్ జహాన్ వివాదం.. క్రిమినల్స్​తో చంపించాలనుకున్నాడంటూ కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Shami-Haseen | టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మరియు అతని మాజీ భార్య హసీన్ జహాన్ మధ్య తలెత్తిన వివాదం మళ్లీ భగ్గుమంది. ఇటీవల కొల్‌కత్తా హైకోర్టు(Calcutta High Court) షమీని, తన కుమార్తె సంరక్షణ కోసం భరణం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

    అది జ‌రిగిన‌ కొద్ది రోజులకే, హసీన్ జహాన్(Haseen Jahan) షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఘాటు పోస్ట్‌ చేశారు. షమీకి వ్యక్తిత్వం లేదు. అతడు క్రూరమైన మనస్తత్వం గలవాడు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. షమీ(Shami) తన దురాశతో కుటుంబాన్ని నాశనం చేశాడని, గత ఏడేళ్లుగా దీనిపై న్యాయపోరాటం చేస్తున్నాన‌ని హసీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    Shami-Haseen | సంచ‌ల‌న ఆరోప‌ణలు..

    మ‌మ్మల్ని అంతమొందించేందుకు, పరువు తీయడానికి నువ్వు ఎంతమంది క్రిమినల్స్‌కు డబ్బులిచ్చావో? అలానే వేశ్యలకు, నేరస్థులకు ఇచ్చిన డబ్బును మన కుమార్తె భవిష్యత్తు కోసం ఖర్చు చేసి ఉంటే మన జీవితం ఎంతో గౌరవంగా ఉండేది కదా అంటూ హసీన్ జహాన్ త‌న పోస్ట్‌లో పేర్కొంది. పురుషాధిక్య సమాజంలో నువ్వు బతుకుతావేమో కానీ, భగవంతుడు నీకు ప్రతిఫలం ఇవ్వకుండా వదిలిపెట్టడు. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది,” అంటూ షమీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నాకు ధైర్యం, స‌హ‌నం ఆ భ‌గ‌వంతుడు ఇచ్చాడు కాబ‌ట్టి ఇంకా పోరాడ‌గ‌లుగుతున్నానంటూ కామెంట్ చేసింది.

    READ ALSO  Ravindra Jadeja | స్టేడియంలో ఫన్నీ సీన్​.. జారిపోయిన జ‌డేజా ప్యాంట్.. న‌వ్వులే న‌వ్వులు..!

    షమీ(Shami) – హసీన్ జహాన్ వివాహం 2014లో జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. కానీ 2018లో ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తి, అప్పటి నుంచి విడిగా జీవిస్తున్నారు. హసీన్ జహాన్ షమీపై గృహహింస (Domestic Violence), మానసిక వేధింపులు, వివాహేతర సంబంధాల ఆరోపణలు చేస్తూ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు షమీ ఈ తాజా ఆరోపణలపై స్పందించలేదు. అయితే హసీన్ వ్యాఖ్యలతో మరోసారి ఈ వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, షమీపై గృహహింస కేసు నమోదు చేసినప్పుడు.. తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలంటూ హ‌సీన్ కోర్టులో కేసు వేసింది. ఆ మొత్తంలో రూ.7 లక్షలు తన ఖర్చుల కోసం కావాల్సి ఉంటుంది. మరో రూ.3 లక్షలు కుమార్తె కోసమని చెప్పుకొచ్చింది. తాజాగా కోర్టు తీర్పు ఇస్తూ.. భార్య హ‌సిన్ జ‌హాన్​తో పాటు కూతురికి ప్రతి నెలా రూ.4 ల‌క్షలు ఇవ్వాల‌ని ఆదేశించింది.

    READ ALSO  Gill double century | ద్విశ‌త‌కంతో గిల్ రికార్డ్.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్

    Latest articles

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే పనులు...

    More like this

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...