అక్షరటుడే, వెబ్‌డెస్క్: harihara veeramallu trailer | పవన్ కల్యాణ్ (Pawan kalyan) అభిమానులు ఎప్పటి నుంచో హరిహర వీరమల్లు (harihara veeramallu) చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ పలుమార్లు వాయిదా పడి జులై 24న సందడి చేసేందుకు సిద్ధమైంది. క్రిష్ (Krish) జాగర్లమూడి/జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వార్డ్ vs స్పిరిట్” ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. 3 నిమిషాలు 1 సెకన్ నిడివితో ఉన్న ట్రైలర్‌లో పవన్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, పొలిటికల్ పంచ్‌లు హైలెట్ అయ్యాయి. యుద్ధ దృశ్యాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
harihara veeramallu trailer | ట్రైలర్ అదుర్స్..
ఇక భారీ సెట్లు, విజువల్స్ కూడా అదిరిపోయాయి. మొత్తానికి ఈ ట్రైలర్ (Trailer) సినిమాపై భారీ అంచనాలే పెంచింది. కీరవాణి (Keeravani) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా అదిరిపోయింది. ఆర్ట్ డైరక్టర్ తోట తరణి కూడా ఈ సినిమాకి బాగానే వర్క్ చేసినట్టు అర్థం అవుతోంది. పవన్ కల్యాణ్ క్రేజీ ఎలివేషన్, బాబీ డియోల్ పర్‌ఫార్మెన్స్, కీరవాణి మాష్ అప్ ఈ ట్రైలర్ అద్దిరిపోయేలా చేస్తోంది. ఈ ఒక్క ట్రైలర్‌తో ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పలు రికార్డ్‌లు కూడా ఈ ట్రైలర్ చెరిపేయడం ఖాయం.
గత కొన్ని నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో వేగవంతంగా, క్రేజీగా ప్రమోషన్స్(Movie Promotions) కార్యక్రమాలు చేపట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలు పెంచడంతో మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు.