అక్షరటుడే, ఎల్లారెడ్డి :GP Worker | కరెంట్ షాక్(Electric Shock)తో జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం nagireddypet mandal ఆత్మకూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన ఎండీ బాబా(35) గ్రామపంచాయతీ (Gram Panchayat)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.