అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Varma | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లాకు చెందిన ఆయా రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy), భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి తదితరులు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.
Governor Jishnu Dev Varma | పథకాల అమలుపై ఫొటో ఎగ్జిబిషన్..
జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తిలకించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫొటోల ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలిపారు. జిల్లాలో అమలవుతున్న పథకాల తీరును వివరించారు. ఈ మేరకు గవర్నర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు.
Governor Jishnu Dev Varma | ఆయా రంగాల్లో ప్రముఖులతో భేటీ..
ఆయా రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులతో గవర్నర్ చర్చించారు. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ (Malavat Purna), అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి సౌమ్య (International footballer Soumya), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Central Sahitya Akademi) గ్రహీత రమేష్ కార్తీక్ నాయక్‌లతో మాట్లాడారు. వీరి అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను గవర్నర్‌కు వివరించారు. అలాగే చరిత్రకారులు, ఆదర్శ రైతు, రచయితలు, కవులు, జానపద కళాకారులు, వాయిద్య కారులు, అష్టావధాని, సాహితీ పరిశోధకులు, విద్యావేత్తలు, చిత్రకారులు తదితర 40 మంది ప్రముఖులతో చర్చ గోష్టి జరిపారు. అనంతరం వారితో పాటు జిల్లా అధికారులతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
Governor Jishnu Dev Varma | ఉదయం నుంచి బిజీ బిజీగా..
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొదటిసారి జిల్లా పర్యటనకు విచ్చేశారు. మొదటగా ఉదయం డిచ్పల్లిలోని పోలీసు బెటాలియన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ పలువురికి బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. భోజన విరామం అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకొని పలువురు ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గవర్నర్‌తో మాట్లాడుతున్న మాలావత్ పూర్ణ, ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగ్లోత్ సౌమ్య

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు