అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రెండు బస్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. మహాత్మ గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) (Mahatma Gandhi Bus Station), జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) (Jubilee Bus Stand) ఉన్నాయి. ఈ రెండు ప్రయాణ ప్రాంగణాల నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుస్తాయి. అయితే నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం మహా నగరంలో మరో బస్టాండ్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) ఓ టీవీ చానెల్‌తో కొత్త బస్టాండ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరంలో (Hyderabad city) మొదట ఎంజీబీఎస్ ఏర్పాటు చేశారు. ఇది నగరం మధ్యలో ఉంటుంది. దీనిని ఇమ్లిబన్ బస్టాండ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే ఐదో పెద్ద బస్టాండ్ కావడం గమనార్హం. అయితే ఎంజీబీఎస్ నగరంలో మధ్యలో ఉండడంతో రద్దీ తగ్గించడానికి జేబీఎస్ ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎక్కువ శాతం జేబీఎస్ వరకు నడుస్తాయి. అయితే ప్రస్తుతం నగరంలో జనాభా పెరగడంతో మరో బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Hyderabad | ఆరాంఘర్ ప్రాంతంలో..
మహబూబ్‌నగర్, నల్గొండ, వికారాబాద్ వైపు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్ నిర్మించాలని యోచిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ఆరాంఘర్ ప్రాంతంలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఆ ప్రాంతం కాకపోతే మరో ప్రాంతంలో అయిన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) దగ్గరగా ఉండేలా బస్టాండ్ నిర్మిస్తామన్నారు. అన్ని వసతులతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ఫోర్త్ సిటీలో కూడా బస్టాండ్, బస్‌డిపో ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. బస్సుల రద్దీ పెరగడంతో ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.