అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | పార్ట్‌టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు (Telangana University VC Yadagiri Rao) అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో (Bhikanoor South Campus) సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు.
త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ (Chairman of the Council of Higher Education) తమకు తెలిపారని వీసీ పేర్కొన్నారు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. వెంటనే సమ్మెను విరమించి విధులలో చేరాలని వారికి సూచించారు. కాగా.. వీసీ సూచన మేరకు అధ్యాపకులు సమ్మెను విరమించారు.