అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్న రకం ధాన్యానికి ఇప్పటికీ బోనస్ డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. అసలు బోనస్ ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో 30 శాతం రుణమాఫీ చేసి, 70 శాతం ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) ప్రజ్ఞాపుర్‌లో సోమవారం హరీశ్‌రావు మాట్లాడారు.
Harish Rao | భూముల రేట్లు పడిపోయాయి
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల రేట్లు పడిపోయాయని హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే.. ఏపీలో పది ఎకరాల భూమి వచ్చేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) పాలన చేతకాక ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ (KCR) పాలన కోరుకుంటున్నారని చెప్పారు.
Harish Rao | వాళ్లు మాత్రమే బాగు పడ్డారు
కాంగ్రెస్ పాలనలో బోరు మోటార్లు మరమ్మతులు చేసే వారు మాత్రమే బాగు పడ్డారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అని దుకాణాలు మూసివేస్తుంటే.. మోటారు మెకానిక్ దుకాణాలు మాత్రం తెరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలు, నాయకులకు మాజీ మంత్రి సూచించారు. బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.