అక్షరటుడే, హైదరాబాద్: Job Notifications : తెలంగాణ(Telangana)లో జాబ్ క్యాలెండర్(job calendar)పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. 2026 మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. 17 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయం(Dr. BR Ambedkar Secretariat)లో గురువారం (జులై 10) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ (cabinet meeting) జరిగింది. సుమారు ఐదు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఇందులో నోటిఫికేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు(local body elections), ఇతర అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.
Job Notifications : మార్చిలోగా లక్ష ఉద్యోగాలు..
మంత్రివర్గ భేటీ అనంతరం వారు తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి (Vakiti Srihari) వెల్లడించారు. జాబ్ క్యాలెండర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 17 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మార్చి, 2026 లోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు (government jobs) భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.
Job Notifications : ఎన్నికల హామీ..
ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్‌పై కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇకపై దీని ద్వారానే నోటిఫికేషన్లు జారీ చేయనుంది.