అక్షరటుడే, వెబ్‌డెస్క్: AIIMS Recruitment | ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు ఎయిమ్స్ శుభవార్త చెప్పింది. ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) 3,501 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో పోస్టులను భర్తీ చేయనుంది. స్టెనోగ్రాఫర్(Stenographer), ఎంటీఎస్, యూడీసీ, గ్రూప్ బీ, సీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, హెల్త్ కేర్ పోస్టు(Health Care Post)ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://rrp.aiimsexams.ac.in/advertisement/6871d99ae3045cd386f7b850 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
AIIMS Recruitment | పోస్టుల వివరాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్(AIIMS)లలో కొలువులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టెనోగ్రాఫర్ పోస్టులు 221, అప్పర్ డివిజన్ క్లర్క్ 702, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ 371, ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టులు 38, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(Medical Records Technician) 144 పోస్టులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్(Operation Theatre Assistant) / టెక్నీషియన్ 195, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 48 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు.
AIIMS Recruitment | అర్హతలు
ఆయా పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ, బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ చదివిన వారు ఆయా పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 ఫీజు చెల్లించాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
AIIMS Recruitment | పరీక్ష వివరాలు..
ఎయిమ్స్‌లో ఆయా పోస్టుల భర్తీ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(Computer Based Test) నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఆగస్టు 25, 26 తేదీల్లో ఉంటాయి. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగం ఇస్తారు.