అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Scholarship applications | రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిష్‌ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పదో తరగతి పూర్తయి ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులు, పాత విద్యార్థుల రెన్యూవల్ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Scholarship applications | సెప్టెంబర్ 30 వరకు గడువు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్షిప్ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. స్కాలర్షిప్ అప్లై చేయడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి..