అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCFL Notification | నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (OBC) అభ్యర్థులకు ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(RCFL) శుభవార్త తెలిపింది. పలు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్(Special recruitment) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ (Notification) వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టులు:
ఆపరేటర్ కెమికల్ ట్రైనీ
జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్- 3
నర్స్ గ్రేడ్-2
మొత్తం ఖాళీలు : 74 (ఇందులో ఓబీసీలకు 33 పోస్టులు, ఎస్టీలకు 26 పోస్టులు, ఎస్సీలకు 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.)
అర్హతలు: యూజీసీ (UGC) లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.
అలాగే అగ్నిమాపక శిక్షణ కేంద్రం నుంచి ఫైర్‌మన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ కోర్సు, బీఎస్సీ భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పలు పోస్టులకు మెకానికల్ లేదా ఇంజినీరింగ్ మొదలైన వాటిలో ఏడాది డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి :
ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు.
వేతనం: నెలకు రూ. 18 వేల నుంచి గరిష్టంగా రూ. 60వేల వేతనం అందిస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (Skill test) నిర్వహిస్తారు. ఇందులో సాధించే మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తులు : ఆన్‌లై(Online)న్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ : దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25 తేదీ. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rcfltd.com ను సందర్శించండి.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘