అక్షరటుడే, వెబ్డెస్క్: TGS RTC | తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ పద్ధతిని(Digital Payment Method) తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. డిజిటల్ పేమెంట్ కోసం కొత్త మిషనరీని తీసుకురాబోతున్నామని చెప్పారు.
TGS RTC | హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అమలు
హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇప్పటికే ఈ పద్ధతిని అమలు చేస్తున్నామని పొన్నం తెలిపారు. గత మూడు నెలలుగా కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 16 నుంచి 20 శాతం వరకు డిజిటల్ పద్ధతిలో పేపెంట్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
TGS RTC | అంతా ఆన్లైన్లోనే..
రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బస్సుల్లో ఆరు వేల బస్సుల్లో అమలు చేస్తామని పొన్నం తెలిపారు. ఇందులో భాగంగా డిజిటల్ మెషిన్లను(Digital Machines) ఉపయోగించనున్నట్లు తెలిపారు. వీటిని హెడ్ క్వార్టర్స్(Headquarters)కు అటాచ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు. ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారనే విషయం తెలుస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఆదాయం ఎంత వస్తుందనేది కూడా ఎప్పటికప్పడు తెలుస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల అకౌంటబులిటీ కూడా పెరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా కొత్త విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.