అక్షరటుడే, వెబ్‌డెస్క్:Movie Ticket Price | ప్రజలకు సినిమాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సినిమా టిక్కెట్ల ధరలను రూ.200లకు పరిమితం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించే భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలకు ఈ పరిమితి వర్తిస్తుంది. వినోద పన్ను సహా అన్ని కలిపి రూ.200 మించకుండా టికెట్ ధరపై సీలింగ్ విధించింది. ఈ మేరకు జారీ జూలై 15న సినిమా (నియంత్రణ) (సవరణ) నియమాలు, 2025 ముసాయిదా నోటిఫికేషన్ హోం శాఖ జారీ(Home Department Issued) చేసింది. ఈ నోటిఫికేషన్‌పై 15 రోజుల లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. సూచనలు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్(Notification) జారీ చేయనున్నారు.
Movie Ticket Price | టిక్కెట్ రేట్లను నియంత్రించేందుకే..
టిక్కెట్ ధర(Ticket Price)లను నియంత్రించాలన్న డిమాండ్లు చాలా సంవత్సరాలుగా వెల్లువెత్తుతున్నాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం మల్టీ ప్లెక్స్‌లో సినిమాకు కనీసం రూ.2 వేలకు పైగా ఖర్చవుతోంది. టికెట్ల ధరలు తగ్గించాలన్న ప్రజల డిమాండ్ మేరకు 2025-26 బడ్జెట్‌లో దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటన చేశారు. టికెట్ రేట్లను రూ. 200 లోపు పరిమితం చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు సినిమాను చూసేలా చేయడమే లక్ష్యంగా అధిక టికెట్ ధరలను అరికట్టడానికి చర్యలు చేపట్టారు.
Movie Ticket Price | అప్పట్లో కోర్టు ఆదేశాలతో..
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం టికెట్ ధరలపై పరిమితి విధించడం ఇదే మొదటిసారి కాదు. 2017-18 బడ్జెట్‌లో కూడా యూనిఫామ్ టిక్కెట్ ధర(Uniform Ticket Prices)లను ప్రతిపాదించింది. మే 11, 2018న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, కోర్టు స్టే తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు.