అక్షరటుడే, వెబ్డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నల రుణాలను మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా రూ.33 కోట్లు రుణమాఫీ (Runamafi) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramayyar) శనివారం ఆదేశాలు జారీ చేశారు.
పరిశ్రమలు & వాణిజ్య శాఖ చేనేత నేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ డబ్బులను అర్హులైన నేతన్నల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న చేనేత రుణాలు మాఫీ కానున్నాయి. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. దీంతో నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రుణమాఫీపై మార్గదర్శకాలు వెలువడితే ఎవరు అర్హులనే దానిపై స్పష్టత రానుంది.