అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం (Rainy season) సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు పడలేదు. మోస్తరు వానలు మాత్రమే కురిశాయి. అడపాదడపా కురిసిన వర్షాలతో అన్నదాతలు (Farmers) వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. అయితే వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. జులై 17 నుంచి 22 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
Weather Updates | పారని వాగులు.. నిండని చెరువులు
వానాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తోంది. అయినా గానీ రాష్ట్రంలో భారీ వర్షాలు లేకపోవడంతో వాగులు, వంకలు పారడం లేదు. చెరువుల్లోకి కూడా కొత్త నీరు రాలేదు. దీంతో భూగర్భ జలాలు (Ground Water) సైతం పెరగలేదు. ఈ క్రమంలో సాగు చేసిన పంటలకు నీరు రైతులు ఆందోళన చెందుతున్నారు. బోరుబావులు ఉన్న రైతులు వాటి ద్వారా పంటలకు నీరు పెట్టుకున్నారు. అయితే కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పొలాలు పారడం లేదని రైతులు వాపోతున్నారు.
Weather Updates | ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి
రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 38 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయింది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో వర్షాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు. దీంతోనే ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. మంగళవారం, బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరించారు.
రాష్ట్రంలో జులై 17 నుంచి 22 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బలమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అలాగే జులై 23 నుంచి 28 వరకు వరుస అల్ప పీడనల కారణంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా వర్షాలు పడుతాయి. హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.