ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమలలో మరో క్యూ కాంప్లెక్స్​!

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమలలో మరో క్యూ కాంప్లెక్స్​!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. రోజు రోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో టీటీడీ (TTD) భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు పరిశీలన కోసం నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ నిర్ణయించింది. మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఛైర్మన్​ బీఆర్​ నాయుడు వివరాలు వెల్లడించారు.

    Tirumala | విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు

    ⁠తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మౌలిక వసతులు, లైటింగ్, భద్రత చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.⁠ ⁠తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించనున్నారు.

    READ ALSO  Vishakapatnam | విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం

    Tirumala | సైబర్​ సెక్యూరిటీ ల్యాబ్​

    ⁠శ్రీవారి భక్తులు సైబర్ నేరాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ (Cyber Security Lab) ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అలాగే భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు నాలుగు కో–ఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. తిరుమలలో అన్ని విభాగాలు ఒకచోట ఉండేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

    Tirumala | ఒంటిమిట్టలో అన్నప్రసాదం

    ఒంటిమిట్ట కోదండరామస్వామి (Vontimitta Kodanda Rama Swamy Temple) వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించిన‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ తెలిపారు. అలాగే సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను అందించాలని నిర్ణయించామన్నారు. నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు.

    READ ALSO  Tirumala | తిరుమల ఘాట్​రోడ్డులో లోయలో దూకిన వ్యక్తి

    హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్దీకరించేందుకు ఆమోదం తెలిపారు. స‌మావేశంలో ఈవో శ్యామలరావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, బోర్డు స‌భ్యులు, జెఈవో వీర‌బ్ర‌హ్మం తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    More like this