అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold price | భారతీయులకు బంగారం అంటే పడిచచ్చిపోతారు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు(Gold jewelry) కొనుగోలు చేసి ధరించేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. బంగారం అంటే కేవలం అలంకరణకే కాకుండా.. మంచి పెట్టుబడి సాధనంగానూ ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాదిలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine war), అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం(US-China trade war), భారత్- పాకిస్థాన్ Pakistan ఉద్రిక్తతలు ఇలా పలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి.. అదే స్థాయిలో రేట్లు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా.. బంగారం ధరలు పతనం అవుతున్నాయి. గత వారం 10 రోజుల్లో భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ గత శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి.
Gold price | నిలకడగా బంగారం ధర..
మే 19, 2025 నాటికి భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం gold rates today may 19th 2025) పట్టాయి. రెండు వారాల క్రితం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 98 వేల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం మాత్రం రూ.95 వేలకు వచ్చేసింది. నేడు ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.95,120గా నమోదైంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,190గా కలదు. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.95,270 కాగా, 22 క్యారెట్ పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 87,340గా ఉంది
ఇక వెండి ధరల(Silver price) విషయానికి వస్తే ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కేజీ వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గిపోయి రూ.1,06,900 స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.96,900 కాగా, బెంగళూరు, పూణే, వడోదరా, ముంబై ప్రాంతాల్లో కూడా రూ.96,900 స్థాయిలోనే ఉంది. అంతకుముందు వరుసగా రూ. 1,000 చొప్పున 3 రోజులు తగ్గాయి. ఇక బంగారం, వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు, ఇతర అంశాల కారణంగానే ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పొచ్చు.