అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం Gold ధరలు భగ్గుమంటున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కసారిగా లక్ష రూపాయలను తాకింది. ఆ సమయంలో ద్రవ్యోల్బణం భయంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు.
కానీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో జూన్ చివర్లో బంగారం ధరలు భారీగా పడిపోయి రూ.94,000 వరకు దిగివచ్చాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ బంగారం ధరలు మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో నిన్నటి ధరల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 24 carats gold ధర: ₹99,710 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 22 carats gold ధర: ₹91,400, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర: ₹74,790.
Today Gold Price : కొనేదెట్టా..
ఈ ధరలు నేడు కూడా అలాగే కొనసాగుతున్నాయి. అంటే నిన్నటితో పోల్చితే ఎటువంటి మార్పు లేదు. బంగారానికి భిన్నంగా, వెండి ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఈ రోజు వాటిలో మార్పు లేదు.
100 గ్రాముల వెండి ధర: ₹12,500, 1 కేజీ వెండి Silver ధర: ₹1,25,000. ఈ ధరలు నిన్నటి లాగే నేడు కూడా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ మారకపు విలువ, దేశీయ డిమాండ్ ఆధారంగా మారుతూ ఉంటాయి. కొనుగోలు ముందు తాజా ధరలు తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ hyderabad, విజయవాడ Vijayawada, విశాఖపట్నం Vizag లలో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ Delhi లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం తులం రూ.92,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.97,020గా నమోదైంది.
ఇక కోల్‌కతా విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,400 కాగా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.99,710గా నమోదైంది.. ఇతర నగరాలతో పోలిస్తే 24 క్యారెట్ల ధరలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక చెన్నైలో Chennai 22 క్యారెట్ల బంగారం తులం రూ.90,781ఉండగా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.99,031గా నమోదైంది.