అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : గత మూడు నాలుగు రోజులుగా బంగారం Gold ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారానికి ముందు లక్షా రెండు వేలకు చేరిన తులం బంగారం ధర.. ఇప్పుడు 90 వేలలోకి చేరింది. కాగా, ఈ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి! ముఖ్యంగా ఆడవాళ్లకు బంగారం అంటే ప్రాణం… ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఉంటుంది. అయితే గత నెలలో బంగారం ధరలు కాస్త పైకి వెళ్లి పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(24-carat pure gold) మళ్లీ లక్ష రూపాయల దాకా చేరింది.
Today Gold Price : తగ్గుతున్న ధరలు..
అయితే జూన్ చివరలో ధరలు తగ్గుతూ, ఇప్పుడు పసిడి ప్రియులకు ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,000కి దిగిపోయింది. హైదరాబాద్(Hyderabad)లో తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం – ₹93,610 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 22-carat gold – ₹89,150గా ఉంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం – ₹73,000గా ట్రేడ్ అయింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ధరలు కొంత తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వెండి Silver ధరల్లో మాత్రం మార్పులేమీ లేవు. బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.100 గ్రాముల వెండి ధర – ₹11,900గా ఉండగా, 1 కిలో వెండి ధర – ₹1,19,000గా ట్రేడ్ అయింది. ఈ ధరలు నిన్నటి ధరలతో సమానంగా ఉన్నాయి.
మొత్తం మీద, బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రియులకు శుభవార్తే. వెండి ధరల్లో మార్పులేవీ లేనప్పటికీ, బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు! అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలోనే బంగారం ధరలలో ఇలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, లేదంటే ఫంక్షన్స్ Functions కోసం బంగారం అవసరమైన వారు ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు.