అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Rates | బంగారం ధరలు gold prices. సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. లేటెస్ట్గా ఆల్‌టైం హై All-time high gold rate దిశగా బంగారు ధరలు దూసుకుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పసిడి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తులం బంగారం ధర 99,860వేల మార్క్‌ను దాటేసింది. బంగారానికి ఇలాంటి ధర ఎప్పుడూ చూడలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Gold Rates | మంగళవారం లక్ష దాటే అవకాశం..
ట్రంప్ Trump అధికారంలోకి వచ్చాక గోల్డ్ ధ రలు Gold rates తగ్గుతాయని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఎప్పుడూ లేనంతగా మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది. బంగారం రూ.లక్ష చేరుకోవడం అనేది ఇక లాంఛనమే. ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే జనవరి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు బంగారం ధర దాదాపు రూ.30 వేల వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో 1.25 లక్షలకు చేరే అవకాశం ఉంది.
Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో International Market కూడా బంగారం ధర భారీగా పెరిగినట్లు చూడవచ్చు. జనవరి1 2025లో బంగారం 31.2 ఔన్స్ ధర us dollar 2,600 డాలర్ల వద్ద ట్రేడ్ Trade అవుతోంది. అక్కడి నుంచి బంగారం ధర 3,400 డాలర్ల గరిష్ఠానికి చేరింది. అంటే బంగారం ధర దాదాపు ఈ నాలుగు నెలల వ్యవధిలో 800 డాలర్లు పెరిగింది. చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.