ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయంటే..!

    Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం మళ్లీ షాక్​ ఇచ్చింది. పసిడి ప్రియులను నిరాశ పరిచింది. బంగారం ధరలు (Gold rates) తగ్గుతాయని ఆశించిన వారికి చుక్కలు చూపిస్తూ మళ్లీ ధరలు పెరిగాయి.

    శ్రావణ మాసం సమీపిస్తున్న తరుణంలో శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడు బంగారం రేట్లను చూసి ఆందోళన చెందుతున్నారు.

    ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు (Today Gold rates) ఆకాశాన్నంటుతున్నాయి. జులై 9, 2025 బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,610గా ఉంది. నిన్నటితో పోలిస్తే పోలిస్తే నేడు రూ.10 పెరిగింది.

    Today Gold Price : మ‌హిళ‌ల‌కు షాక్‌..

    హైదరాబాద్‌లో 24 క్యారెట్లు – రూ.98,850 ఉండ‌గా, 22 క్యారెట్లు – రూ.90,610, కిలో వెండి – రూ.1,19,800గా ట్రేడ్ అయింది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో 24 క్యారెట్లు – రూ.98,850, 22 క్యారెట్లు – రూ.90,610, కిలో వెండి – రూ.1,19,800గా న‌మోద‌య్యాయి.

    READ ALSO  Today Gold Price | మ‌గువల‌కు మ‌ళ్లీ షాక్.. రూ.ల‌క్ష‌కు చేరువ‌లో బంగారం ధ‌ర‌

    బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ ఉండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర రూ.11,990 దగ్గర ట్రేడ్ కాగా, కేజీ వెండి (Silver) ధర రూ.1,19,900గా ఉంది.

    అయితే, ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గ‌డంతో 100 గ్రాముల వెండి ధర నేడు రూ.11,980 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర రూ.1,19,800 దగ్గర ట్రేడ్ అవుతుంది.

    రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు మధ్యతరగతి కుటుంబాలకు పెద్దభారం అవుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో కొనుగోలు చేయాల‌నుకునే వారు పెరిగిన ధ‌ర‌ల‌ను ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు, డాలర్ (Dollar) – రూపాయి మారకం, ముడి బంగారం ధరల మార్పుల ప్రభావం వీటిపై స్పష్టంగా కనిపిస్తోంది.

    READ ALSO  Today Gold Price | అతివలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..

    Latest articles

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | మండలంలో తెల్లవారుజామున యువకుడి హత్య కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన రమేష్​...

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు...

    ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల...

    Supreme Court | వీధికుక్కలకు ఇంట్లో ఆహారం పెట్టొచ్చుగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | దేశవ్యాప్తంగా వీధికుక్కల(Street Dogs) బెడద ఎక్కువ అయిపోయింది. వీటి మూలంగా ప్రజలు...

    More like this

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | మండలంలో తెల్లవారుజామున యువకుడి హత్య కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన రమేష్​...

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు...

    ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల...