అక్షరటుడే, వెబ్డెస్క్:Gold Prices | మొన్నటి దాకా పరుగులు పెట్టిన పసిడి రేట్లు(Gold Rates) క్రమంగా దిగివస్తున్నాయి. ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని అంటేలా పెరిగిన విషయం తెలిసిందే.
తులం బంగారం ఏకంగా రూ.లక్ష దాటిపోయింది. అయితే ప్రస్తుతం రేట్లు దిగి వస్తున్నాయి. గురువారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు(Gold Prices) భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,180 తగ్గి రూ.95,730 కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.2 వేలు దిగి వచ్చి రూ.87,750 పలుకుతోంది.
ప్రస్తుతం వివాహాల సీజన్(Wedding season) కావడంతో ప్రజలు బంగారం అధికంగా demand for gold కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో రేట్లు దిగి వస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేట్లు మళ్లీ పెరుగుతాయా.. మరింత తగ్గుతాయా..? అనే విషయాలు అంతర్జాతీయ మార్కెట్లు(International Markets), ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.