అక్షరటుడే, వెబ్డెస్క్:Gold Price | గత కొద్ది రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు(Gold prices) బుధవారం భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో రూ.లక్ష దాటిన తులం బంగారం ధరలు ఒకేరోజు రూ.3 వేలు తగ్గాయి. దీంతో మళ్లీ పసిడి gold rate today రూ.లక్ష దిగువకు దిగి వచ్చింది. కాగా బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3 వేలు తగ్గి రూ.98,350కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది.
కాగా కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటేలా దూసుకు పోయిన బంగారం ధరలు(Gold prices) ఒకేరోజు భారీగా తగ్గడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్ముందు ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గడంతో పసిడి కొనాలనుకునే వారు ఈ రోజు దుకాణాలకు వెళ్తున్నారు.