అక్షరటుడే, వెబ్డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ Operation sindoorతో వంద మందికి పైగా ఉగ్రవాదులని హతమార్చిన విషయం తెలిసిందే. ప్రపంచంలో యుద్ధం అనంతరం జియో పాలిటికల్ ఒత్తిడి పెరిగినప్పుడు, షేర్ మార్కెట్లు పడిపోయి, బంగారం ధరలు పెరిగినట్లుగా అనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కు దాటింది బంగారం. ఆ తర్వాత తగ్గుతూ వచ్చినట్టు కనిపించిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 99వేలకు పైగా ఉంది. మే 08 2025 గురువారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. ధరలు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తుంది.
Today gold price | పెరుగుతున్న ధరలు..
దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,760 గా ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.99,010 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,100లుగా ఉంది. పదిగ్రాముల బంగారంపై Gold రూ.100, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. ప్రాంతాల వారీగా చూస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,910, 24 క్యారెట్ల ధర రూ.99,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.98,010 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,760, 24 క్యారెట్ల రేటు రూ.99,010 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది. ఇక వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి Silver ధర రూ.1,11,100 కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,100, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,100, ముంబైలో రూ.99,100, బెంగళూరులో రూ.99,100గా ఉంది. చెన్నైలో రూ.1,11,100 లుగా ఉంది.