అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : దేశవ్యాప్తంగా బంగారం ధరలు (Gold rates) తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజుల క్రితం లక్ష రూపాయల వరకు వెళ్లిన గోల్డ్ రేట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ, వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ బంగారం ధర మరింతగా తగ్గింది.
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు అంటున్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు స్టాక్ మార్కెట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండడం, గ్లోబల్ మార్కెట్‌ల్లో స్థిరత్వం పెరగడం కూడా బంగారం డిమాండ్ తగ్గడానికి కారణమయ్యాయి.
Today Gold Price : గుడ్ న్యూస్..
జులై 5, శనివారం నాడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ₹98,870, 22 క్యారెట్ల బంగారం ₹90,640, వెండి (కిలో) ₹1,09,900గా ఉంది. ఇక ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ₹98,720, 22 క్యారెట్ల బంగారం ₹90,490, వెండి (కిలో) ₹1,09,900గా ట్రేడ్ అయింది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ₹98,720, 22 క్యారెట్ల బంగారం ₹90,490, వెండి (కిలో) ₹1,19,900గా ఉంది. బెంగళూరులో (Bangalore) చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ₹98,720, 22 క్యారెట్ల బంగారం ₹90,490, వెండి (కిలో) ₹1,09,900గా ట్రేడ్ అయింది.
- ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (24 carat gold) ₹98,720, 22 క్యారెట్ల బంగారం (22 carat gold) ₹90,490, వెండి (కిలో) ₹1,19,900గా నమోదైంది.
- విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ₹98,720, 22 క్యారెట్ల బంగారం ₹90,490, వెండి (కిలో) ₹1,19,900 పలుకుతోంది.
- విశాఖపట్నంలో చూస్తే 24 క్యారెట్ల బంగారం ₹98,720, 22 క్యారెట్ల బంగారం ₹90,490, వెండి (కిలో) ₹1,19,900గా ఉంది.
హైదరాబాద్‌లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,730 రూపాయల దగ్గర ట్రేడ్ కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,050 రూపాయల దగ్గర ఆగింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గడం గమనార్హం.