అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : తాజా పరిస్థితులు చూస్తుంటే బంగారం కొనేలా కనిపించడం లేదు. ఆషాఢ మాసం పండుగల సీజన్, రానున్న శ్రావణ మాసం పెళ్లిళ్లు ఉండడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు.
కానీ, వారికి షాకిస్తూ పసిడి పరుగులు పెడుతోంది. జూన్ నెలాఖరున వరుసగా 7-8 రోజులుగా తగ్గిన గోల్డ్ ధర ఇప్పుడు మాత్రం పరుగులు పెడుతోంది. తాజా పరిస్థితిని చూస్తే బంగారం కొనాలనుకునే వారు ఒక్కసారిగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో బంగారం రూ.93 వేల నుండి రూ.98 వేల గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, మౌలికంగా బంగారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో, ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Today Gold Price : పైపైకి పసిడి..
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం (24 carat gold) (10 గ్రాములు): ₹98,900గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం(22 carat gold)(10 గ్రాములు): ₹90,660గా ఉంది. 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹74,180 వద్ద ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చితే పది గ్రాముల బంగారంపై రూ.10 వరకు పెరిగింది. గ్రాముకు ఒక రూపాయి చొప్పున పెరుగుదల కనిపిస్తోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,050గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,810గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది. ముంబయి విషయానికి వస్తే 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900గా ఉంది.
చెన్నై(Chennai)లో 24 క్యారెట్ల ధర రూ.98,900 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,660గా ట్రేడ్ అయింది. వెండి కిలో రూ.1,20,100 లుగా ఉంది. బెంగళూరు(Bangalore)లో 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. వెండి కిలో రూ.1,19,900 లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900.
బంగారం కొనాలనుకుంటున్న వారు ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా జాగ్రత్త వహించాలి. తక్కువ ధర ఉన్న సమయంలోనే కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు, బంగారం ధరలు పెరుగుతుండగా వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 100 గ్రాముల వెండి ధర: ₹11,990 (₹10 తగ్గుదల) కాగా, 1 కేజీ వెండి ధర: ₹1,19,900 (₹100 తగ్గింది).