అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం Gold ధరలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి పెరిగడం, మరో సారి తగ్గుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ నేడు మళ్లీ పెరిగాయి. నేడు 24 క్యారెట్ల బంగారం 98 వేల దగ్గర ట్రేడ్ అవుతుండగా, మళ్లీ రానున్న రోజులలో లక్ష దాటే అవకాశం కనిపిస్తోంది. ఆషాఢ మాసం, శ్రావణ మాసాల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఓ బ్యాడ్ న్యూస్‌గానే చెప్పాలి.
Today Gold Price : పెరిగిన ధరలు..
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండడం కలవరపరుస్తుంది. జూన్ నెలాఖరులో వరుసగా ఏడు రోజుల పాటు తగ్గిన గోల్డ్ రేట్లు జూలై 1 నుండి తిరిగి పెరుగుదల దిశగా సాగుతున్నాయి. జూలై 2 బుధవారం Wednesday కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈరోజు (జూలై 2, 2025) భారతదేశంలో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము): ₹9,841, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము): ₹9,021, 18 క్యారెట్ల బంగారం (1 గ్రాము): ₹7,381గా ఉంది.
ఇక ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీ Delhiలో చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్: రూ.98,560 కాగా, 22 క్యారెట్ల గోల్డ్: ₹90,360, వెండి (కిలో): ₹1,10,100గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్: ₹98,410, 22 క్యారెట్ల గోల్డ్ ₹90,210గా ఉండగా, వెండి (కిలో) ₹1,10,100కి చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ₹98,410, 22 క్యారెట్ల గోల్డ్ ₹90,210, వెండి (కిలో) ₹1,20,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ₹98,410, 22 క్యారెట్ల గోల్డ్ ₹90,210, వెండి (కిలో) ₹1,10,100గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ ₹98,410, 22 క్యారెట్ల గోల్డ్: ₹90,210, వెండి (కిలో) ₹1,20,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ₹98,410, 22 క్యారెట్ల గోల్డ్ ₹90,210, వెండి (కిలో) ₹1,20,100గా ఉంది. పండుగల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో, గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశముంది.