More
    Homeభక్తిTeppotsavam | తెప్పోత్సవాలకు సిద్ధమైన పద్మావతి అమ్మవారు

    Teppotsavam | తెప్పోత్సవాలకు సిద్ధమైన పద్మావతి అమ్మవారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teppotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి (Padmavati ammavaru) వార్షిక తెప్పోత్సవాలు (Teppotsavam) ఈ నెల 7 నుంచి 11 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే వేడుకలకు టీటీడీ (TTD) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

    ఉత్సవాల్లో భాగంగా జూన్ 7న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామితెప్పలపై విహరించనున్నారు. 8న సుందరరాజస్వామి, 9న పద్మావతి అమ్మవారు తెప్పలపై నుంచి భక్తులకు అనుగ్రహిస్తారు. జూన్ 10వ తేదీ రాత్రి గజ వాహనంపై, 11న రాత్రి గరుడ వాహనంపై అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

    Teppotsavam | ఆర్జిత సేవలు రద్దు

    తెప్పోత్సవాల సందర్భంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

    Latest articles

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...

    Kamareddy | నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తల్లి ఆత్మహత్య

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకును చెరువులో...

    Nizamabad city | నగరంలో దంపతుల ఆత్మహత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | నిజామాబాద్ నగరంలో దంపతుల సూసైడ్ కలకలం రేపింది. దంపతులిద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య...

    More like this