ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | బలహీనంగా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | బలహీనంగా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.18 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 0.40 శాతం నష్టపోయింది. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.10 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.67 శాతం, సీఏసీ 0.54 శాతం, డీఏఎక్స్‌ 0.42 శాతం నష్టపోయాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.93 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.48 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.24 శాతం లాభంతో ఉన్నాయి. కోస్పీ 0.59 శాతం, షాంఘై 0.17 శాతం, నిక్కీ 0.02 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.36 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Stock Market | భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 120 కోట్ల విలువైన స్టాక్స్‌, డీఐఐ(DII)లు నికరంగా రూ. 1,555 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.72 నుంచి 0.88 కు పెరిగింది. విక్స్‌(VIX) 4.17 శాతం తగ్గి 11.48 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 69.02 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 18 పైసలు బలపడి 85.81 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.48 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.57 వద్ద కొనసాగుతున్నాయి.
    • జూన్‌కు సంబంధించిన యూఎస్‌ ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ డాటా ఈ రోజు వెలువడనుంది. కాగా ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావంతో జూన్‌కు సంబంధించిన యూఎస్‌ సీపీఐ డాటా(US CPI data) మార్కెట్‌ను నిరాశపరిచింది. సీపీఐ ఇన్ఫ్లెషన్‌ గతేడాది జూన్‌తో పోల్చితే ఈసారి 0.3 శాతం పెరిగి 2.7 శాతానికి చేరింది. ఇది ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతలపై ప్రభావం చూపవచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
    • యూఎస్‌, భారత్‌ల మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌ విషయంలో చిక్కుముడులు వీడడం లేదు. దీంతో మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది.
    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Latest articles

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు....

    More like this

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...