అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్, యూరోప్ మార్కెట్లు నెగెటివ్‌గా ఉండగా.. ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
గతవారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా(America) మార్కెట్లు నెగెటివ్‌గా ముగిశాయి. నాస్‌డాక్(Nasdaq) 1.30 శాతం, ఎస్‌అండ్‌పీ 1.13 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ స్వల్ప లాభంతో కదలాడుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
యూరోప్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. డీఏఎక్స్(DAX) 1.09 శాతం, సీఏసీ 1.05 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.39 శాతం నష్టపోయాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 0.95 శాతం, కోస్పీ 0.61 శాతం, షాంఘై 0.09 శాతం లాభంతో ఉండగా.. స్ట్రేయిట్స్ టైమ్స్ 0.38 శాతం, హంగ్‌సెంగ్ 0.08 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.29 శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.23 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే(Gap up opening) అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 1,263 కోట్ల విలువైన స్టాక్స్, డీఐఐలు రూ. 3,041 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.92 నుంచి 0.89 కు తగ్గింది. విక్స్(VIX) 7.69 శాతం పెరిగి 15.08 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 1.21 శాతం పెరిగి 73.82 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 47 పైసలు పడిపోయి 86.08 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.27 వద్ద ఉండగా.. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.23 శాతం పెరిగి 4.42 కు చేరింది.
- ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, యూఎస్ టారిఫ్ పాలసీల ఖరారులో అనిశ్చితితో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి.
- ముడి చమురు ధరలు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.
ఈ వారంలో నిర్వహించే యూఎస్ ఫెడ్ మీటింగ్(US Fed meeting)పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ మీటింగ్‌లో రేట్ కట్ ఉండకపోవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. అయితే ఫెడ్ కామెంటరీ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో ఓలటాలిటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.