అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : అమెరికా సెనెట్ ఆమోదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్(Big beautiful bill) నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు ఎక్కువగా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్(US) మార్కెట్‌లో రెడ్‌లో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడింగ్ సెషన్‌ను ముగించాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
నాస్‌డాక్(Nasdaq) 0.82 శాతం, ఎస్‌అండ్‌పీ 0.11 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.06 శాతం లాభంతో కొనసాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
డీఏఎక్స్ ఒక శాతం, సీఏసీ(CAC) 0.04 శాతం నష్టపోగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.28 శాతం లాభపడింది.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 1.54 శాతం, నిక్కీ ఒక శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.35 శాతం, షాంఘై 0.04 శాతం నష్టంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్ 0.66 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.31 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.07 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,970 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐ(DII)లు నికరంగా రూ. 771 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.81 నుంచి 0.88కి పెరిగింది. విక్స్ 2.01 శాతం తగ్గి 12.53 వద్ద ఉంది. ఇది బుల్స్‌కు అనుకూల వాతావరణాన్ని సూచిస్తోంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 0.19 శాతం పెరిగి 67.24 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 85.52 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.26 శాతం పెరిగి 4.25 వద్ద, డాలర్ ఇండెక్స్ 0.05 శాతం తగ్గి 96.73 వద్ద కొనసాగుతున్నాయి.
వాణిజ్య ఒప్పందాల విషయంలో ట్రంప్ ఇచ్చిన టారిఫ్ పాజ్(Tariff pause) గడువు ఈనెల 9వ తేదీతో ముగియనుంది. ఇప్పటికీ చాలా దేశాలతో ఎలాంటి ట్రేడ్ డీల్ కుదరలేదు. ఈ నేపథ్యంలో జూలై 9 తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తారోనన్న ఆందోళన మార్కెట్లలో నెలకొంది. మరోవైపు ట్రంప్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌కు సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం అమెరికా మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. ఈ బిల్ అమెరికా ట్రెజరీ మార్కెట్‌కు మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.