అక్షరటుడే, ఇందూరు: KTR tweet | “కాంగ్రెస్ నాయకులకు (Congress leaders) పోలీస్ యూనిఫామ్ ఇవ్వండి అని… అలాగే పోలీస్ స్టేషన్ నిర్వహణను అప్పజెప్పాలి” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ‘ఎక్స్’లో ట్వీట్ (KTR tweet) చేశారు.
సోమవారం ఆర్మూర్ లోని పోలీస్ స్టేషన్ పాత భవనంలో బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ తరహాలో వీడియో తీసి వైరల్ చేశారు. ఘటనపై ఎస్ హెచ్వో సత్యనారాయణకు వివరణ కోరగా.. పోలీస్ స్టేషన్లో ఎటువంటి ప్రెస్ మీట్ నిర్వహించలేదని, వేల్పూర్ ఘటనలో ముందస్తు చర్యలో భాగంగా పాత భవనానికి తరలించామన్నారు. అయితే అక్కడ వారి నాయకులతో సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారని తెలిపారు.